సరిలేరు నీకెవ్వరు
సరిలేరు నీకెవ్వరు బోర్డర్ అట్టుడికిపోతుంది. శత్రువులు వేలల్లో వచ్చేసారు ఒకేసారి. సైన్యం చూస్తే బలహీనంగా వుంది. పిడుగుల్లా పడుతున్నాయి మిస్సైల్ లు. ఎదురు కాల్పుల్లో సైనికులు మట్టి కరుస్తున్నారు. నా దేశాన్ని కాపాడే బాధ్యత నాదే. ఈరోజు ఇక్కడ జరిగే ఈ పోరాటం నా దేశాన్ని, నా కుటుంబాన్ని కాపాడుతుంది. ప్రాణాలు లెక్క కాదు, దేశం బ్రతకడం నాకు ముఖ్యం. భుజానికి బులెట్ తగిలింది. రక్తం ఆగట్లేదు, పరిగెడుతుంది. కానీ నా పరుగు ఆగలేదు. శత్రువు తప్ప నాకు ఇంకా వేరే ఎవరు కనిపించట...