Posts

సరిలేరు నీకెవ్వరు

Image
                                                              సరిలేరు నీకెవ్వరు                     బోర్డర్ అట్టుడికిపోతుంది. శత్రువులు వేలల్లో వచ్చేసారు ఒకేసారి. సైన్యం చూస్తే బలహీనంగా వుంది. పిడుగుల్లా పడుతున్నాయి మిస్సైల్ లు. ఎదురు కాల్పుల్లో సైనికులు మట్టి కరుస్తున్నారు. నా దేశాన్ని కాపాడే బాధ్యత నాదే.                    ఈరోజు ఇక్కడ జరిగే ఈ పోరాటం నా దేశాన్ని, నా కుటుంబాన్ని కాపాడుతుంది. ప్రాణాలు లెక్క కాదు, దేశం బ్రతకడం నాకు ముఖ్యం.                     భుజానికి బులెట్ తగిలింది. రక్తం ఆగట్లేదు, పరిగెడుతుంది. కానీ నా పరుగు ఆగలేదు. శత్రువు తప్ప నాకు ఇంకా వేరే ఎవరు కనిపించట...

అప్పటికే ఆలస్యమైంది

Image
                                                    అప్పటికే ఆలస్యమైంది                                                                                                                                               మా ఇంట్లో అమ్మ, నాన్న, నాన్నమ్మ, అన్నయ్య మరియు వదిన ఆరుగురం వుంటున్నాం. వదిన వాళ్ళ అన్నయ్య (వరసకి భావ) పెళ్లి ఉండటం తో అందరం చాలా రోజుల తరువాత ఊరికి వచ్చారు. ...

'మాస్క్'

Image
                                                                  'మాస్క్'                   ఉదయాన్నే లేచి జాగింగ్ చెయ్యడం శ్రీనివాస్ కి అలవాటు. వెళ్లే ముందు, "నాన్న! జాగింగ్ కి వెళ్ళొస్తా" అని చెప్పి బయల్దేరాడు. "నేనూ వస్తా తోడుగా" అని ఎవరో పిలిచినట్టు అనిపించింది. వినడానికి ఆ గొంతు చిన్నపిల్లాడిది లా అనిపించింది. వెనక్కి తిరిగి చూసాడు, కానీ అక్కడ ఎవరు లేరు. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరూ లేరు, ఎవరు పిలిచారు అబ్బా???? అని, సరే! నా భ్రమ ఏమో అనుకుని బయల్దేరాడు.                   బాగా కసరత్తులు చేసి ఇంటికి చేరుకున్నాడు. వచ్చి రాగానే టీవీ పెట్టాడు శ్రీనివాస్.                  "ఈరోజు నుంచి...

భూత్ బంగ్లా

Image
                                                                                                                             భూత్ బంగ్లా సాయంత్రం ఏడు దాటింది రాజు ఇంకా ఇంటికి రాలేదు. రోజూ ఆరు గంటల లొపే ఇంటికి చేరే రాజు ఏడు ఐన రాకపోయే సరికి కంగారు పడుతూ పక్కింటి పండు గాడిని ఆరా తీయడానికి వెళ్ళింది రాజు వాళ్ళ అమ్మ.  పండు గాడు కూడా ఇంకా ఇంటికి రాలేదని వాడి కోసం ఇప్పుడే వాళ్ళ నాన్న వాడ్ని తీసుకు రాడనికి వెళ్ళారని పండు వాళ్ళ అమ్మ వివరించింది. సమయం పెరిగే కొద్దీ ఆందోళన మరింత ఎక్కువైంది. ఆడుకోడానికి వెళ్ళిన వీరిద్దరు ఎటు వెళ్ళారని ఇరు ఇళ్లలో వెతుకులాట మొదలయింది. ఊరంతా వెతికిన వీళ్ళ జాడ తెలీలేదు. రాత్రి పది అయింది రాజు స్నేహితుడు ఐన రమేశ్ దగ్గరకు వెళ్ళారూ రాజు తల్లి...